ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వవిద్యాలయాల్లో ఖాళీలని త్వరలోనే భర్తీ చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 04:04 PM

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ శాసనమండలిలో స్పష్టం చేశారు. ఈ నియామకాల కోసం పూర్తిస్థాయిలో న్యాయపరమైన చిక్కులను అధిగమించి, కొత్త నోటిఫికేషన్ జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు.ఇవాళ‌ శాసనమండలిలో సభ్యుడు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్‌ బదులిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ ఖాళీల భర్తీ కోసం 2018, 2023లో గత ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇచ్చినా, అవి ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా 2023 నాటి నోటిఫికేషన్‌లో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను సరిగ్గా పాటించకపోవడంతో న్యాయస్థానం దాన్ని తప్పుబట్టిందని, దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని వివరించారు. ఈ నేపథ్యంలో న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే ఏఏజీతో మూడుసార్లు సమావేశమై చర్చించామని, త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa