ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరికొత్త చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్ 2026

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 04:02 PM

టీ20 ప్రపంచకప్ 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన ఎడిషన్‌గా రికార్డులకెక్కింది. కేవలం భారత్‌లోనే ఈ టోర్నమెంట్‌ను వీక్షించిన వారి సంఖ్య 50 కోట్లు దాటడం విశేషం. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికం.ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. ఈ టోర్నమెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించామని, భారత్‌లో 50 కోట్ల వ్యూయర్‌షిప్ దాటడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అదే సమయంలో జియో హాట్‌స్టార్‌లో ఒకేసారి 6.05 కోట్ల మంది వీక్షించడం అద్భుతమని పేర్కొన్నారు. నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో భారత అభిమానుల ప్రేమతో మరిన్ని రికార్డులు బద్దలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa