ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీనగర్ ఎంపీపై కేసు నమోదు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 03:54 PM

శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో 'తప్పుదోవ పట్టించే కంటెంట్‌'ను షేర్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను, అలాగే షియా ముస్లింలు ఆరాధ్య దైవంగా భావించే అయతుల్లా అలీ ఖమేనీ హత్యను రుహుల్లా తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌లో జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలను ఆయన పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది.ఈ ఎఫ్ఐఆర్ పై రుహుల్లా కార్యాలయం ఘాటుగా స్పందించింది. "ఒక దేశ సార్వభౌమాధికారి హత్యను ఖండించే ధైర్యం లేని యంత్రాంగం, ఆ విషయాన్ని ప్రశ్నించిన వ్యక్తిపై కేసు పెట్టే ధైర్యం మాత్రం చేస్తోంది" అని విమర్శించింది. మరోవైపు, ప్రజల్లో భయాందోళనలు కలిగించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందునే ఈ కేసు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని కఠిన సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa