టాలీవుడ్ నటుడు, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు హీరోగా, కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య తెరకెక్కించిన హారర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ "జిన్నా". పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
దీపావళి కానుకగా రేపు థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది. శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన ఢీ తదుపరి దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఈడోరకం ఆడోరకం వంటి సూపర్ హిట్ ల తరవాత విష్ణు కెరీర్ లో సాలిడ్ హిట్ ఐతే ఇప్పటి వరకు రాలేదు. ఈ మధ్యకాలంలో తెలుగులో హారర్ కామెడీ కూడా రాలేదు. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జిన్నా కు ఇది చాలా ప్లస్ పాయింట్. ఈ సినిమాతో ఎలాగైనా గ్రాండ్ కం బ్యాక్ ఇస్తాననే బలమైన నమ్మకంతో ఉన్నారు విష్ణు. ఆయన నమ్మకం వందశాతం నిజమవ్వాలని మనం కూడా కోరుకుందాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa