రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం "ధమాకా". నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో మాస్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా "జింతాక్" అనే మాస్సీ సాంగ్ రిలీజ్ అయ్యి, ప్రేక్షకుల విశేష ఆదరణను చూరగొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట 26 మిలియన్ల క్యూములేటివ్ వీక్షణల మార్క్ ను అందుకున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. హీరోహీరోయిన్ల మధ్య సాగే మంచి మాస్ సాంగ్ గా, పెప్పి మ్యూజిక్ తో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తున్న ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, భీమ్స్, మంగ్లీ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa