ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏబీసీడీ ఫ‌స్ట్ లుక్‌ విడుద‌ల‌కి టైం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 27, 2018, 11:57 AM

కెరీర్‌లో ఆచితూచి అడుగులేస్తున్న అల్లు శిరీష్ ప్ర‌స్తుతం మ‌ల‌యాళ చిత్రం ఎబిసిడి (అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ)ని రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే . తెలుగులోను ఇదే పేరుతో మూవీ రూపొందుతుంది. నూత‌న ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుండ‌గా ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్‌ రంగినేని, మధుర’ శ్రీధర్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూఎస్ నుండి విహార యాత్ర‌కి ఇండియాకి వ‌చ్చిన ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి త‌న జీవితంలో ఎదురైన సంఘ‌ట‌ల‌ని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాడ‌నేది సినిమాలో ఆస‌క్తికరంగా చూపించ‌నున్నార‌ట‌ . ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించి మెప్పించిన రుక్స‌ర్ థిల్లాన్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఫిబ్ర‌వరి 8, 2019న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ఆ మ‌ధ్య మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌గా, కొద్ది సేప‌టి క్రితం రేపు మ‌ధ్యాహ్నం 12.30ని.లకి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమా శిరీష్‌కి మంచి హిట్ అందిస్తుందని టీం భావిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa