మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ జంటగా నటిస్తున్న మూవీ వినయ విధేయ రామ.. మాస్ మసాలా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 11వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ వి డుదల చేసింది.. ఈ ట్రైలర్ ను పూర్తిగా యాక్షన్ సీన్స్ తో నింపేశారు..సరైన సింహ తగలనంత వరకూ ప్రతి వేటగాడుమగాడే రా అన్న డైలాగ్ సూపర్ గా ఉంది.. కేవలం 12 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ కు 30 లక్షలకు పైగా వ్యూస్ లభించడం విశేషం. ప్రతి ఫేమ్ లోనూ బోయపాటి మార్క్ కనిపించింది.వివేక్ ఒబేరాయ్, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్, స్నేహ, మధుమిత, హిమజ కీలక పాత్రలలో కనిపించనున్నారు..దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa