రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం "ధమాకా" నుండి నిన్న సాయంత్రం వాట్స్ హ్యాపెనింగ్ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ లవ్ మెలోడీని సింగర్స్ రమ్య బెహరా, భార్గవి పిళ్ళై ఆలపించారు. మోడరన్ లిరిక్స్ తో ఈపాట యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. తాజాగా ఈ పాట యూట్యూబులో 1మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది.
నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో ఔటండౌట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కాబోతుంది. శరత్ ఖేడ్కర్, శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీలో కూడా విడుదల కాబోతుంది.