హీరోయిన్లకు అవకాశాలు రావడంలో వయసు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు నటి రాధికా ఆప్టే. 'భారీ కమర్షియల్ చిత్రాల్లో యువ నటీమణులకే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. తమ స్క్రిప్ట్‌కు తగిన విధంగా ఉండే యువ తారలను ఎంచుకోవడానికి ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు' అని చెప్పింది. అందుకే తాను కొన్ని ఆఫర్స్ చేజార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు.