తాలా అజిత్ కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం "తునివు". వినోద్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, తునివు మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ సింగిల్ ఊరమాస్ నెంబర్ అని, సగటు అజిత్ అభిమానిగా ఈ పాటకోసం తన నుండి వందశాతం ఎఫర్ట్ పెట్టినట్టు పేర్కొన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఘిబ్రాన్. దీంతో తాలా అభిమానులు ఈ సాంగ్ పై భీభత్సమైన అంచనాలను ఏర్పరుచుకున్నారు.
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.