విజయ్ దేవరకొండ సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. విజయ్ దేవరకొండ ఓ మలయాళ సినిమాకు ఓకే చెప్పాడట. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించనున్న ‘వృషభ’ సినిమాలో విజయ్ ఓ కీలకపాత్ర పోషించనున్నాడని, ఈ చిత్రంలో విజయ్ మోహన్‌లాల్ కొడుకుగా కనిపించనున్నాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తండ్రి, కొడుకుల డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం.