గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం "వీరసింహారెడ్డి". అఖండ సక్సెస్ ను వీరసింహారెడ్డి తో బాలయ్య కంటిన్యూ చెయ్యాలని నందమూరి అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదీకాక రీసెంట్గా రిలీజైన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియోలు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పలు యాక్షన్ అండ్ డ్రామా సన్నివేశాలను చిత్రీకరించిన చిత్రబృందం నవంబర్ 18 నుండి బాలయ్య, శ్రుతిహాసన్ లపై ఒక రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ను షూట్ చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తుందట. మరి, ఈ విషయమై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa