ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవ్ టుడే తెలుగు ట్రైలర్ : మొబైల్స్ ఎక్స్చేంజ్ ..ఎంతపని చేసింది !

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 10:39 AM

కోలీవుడ్ బాక్సాఫీస్ ను కొల్లగొడుతూ, అక్కడి ప్రజల విశేష ఆదరణను అందుకుంటున్న "లవ్ టుడే" సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతుందన్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితమే ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలయ్యింది.


ఇద్దరు ప్రేమికులు తమ మొబైల్స్ ను ఎక్స్చేంజ్ చేసుకోవడం, అప్పటివరకు ఒకరి గురించి ఒకరికి తెలియని ఎన్నో విషయాలు, రహస్యాలు, అలవాట్లు మరొకరికి తెలియడం, ఈ నేపథ్యంలో పాత్రధారుల మధ్య ఏర్పడే ఫన్నీ ఇన్సిడెంట్స్ తో ట్రైలర్ సూపర్బ్ గా ఉంది. నవ్విస్తూనే, ఆలోచింపచేస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై చాలా మంచి అంచనాలను ఏర్పరిచింది. మోడరన్ డేస్ లో యువతీయువకుల లవ్, డేటింగ్, చాటింగ్ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో క్లియర్ గా చూపించినట్టు తెలుస్తుంది.


ప్రదీప్ రంగనాధన్ డైరెక్ట్ చేసి ఆయనే హీరోగా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, యోగి బాబు, ఇవానా, రవీనా ముఖ్యపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను దిల్ రాజుగారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పోతే, ఈ నెల్లోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa