రీసెంట్గానే థియేటర్లలో విడుదలై, దిగ్విజయ కలెక్షన్ల పరుగుతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం "యశోద". సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హరి శంకర్, హరీష్ నారాయణ్ డైరెక్ట్ చేసారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ భారీ బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 11న పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.
తాజాగా పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా యశోద సినిమా నుండి బేబీ షవర్ వీడియో సాంగ్ విడుదలైంది. సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ పాట చాలా కీలకం. పెళ్లి కాకుండానే ప్రెగ్నన్సీకి సిద్ధపడిన యువతులందరూ కలిసి ఎంతో ఆనందంగా పాడుకునే ఈ పాటను మణిశర్మ గారు స్వరపరిచారు. సింగర్ సాహితీ చాగంటి పాడగా, సరస్వతి పుత్ర రామజోగయ్యశాస్త్రి గారు లిరిక్స్ అందించారు.