రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సర్కస్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది అని సమాచారం. ఇదే విషయాన్ని రణ్‌వీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, ఈ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలనే దానిపై మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా మాస్టర్ ఫిల్మ్ మేకర్ ఏదో మాస్టర్ ప్లాన్ తో వస్తున్నాడని ఈ ఫోటోకి కాప్షన్ ఇచ్చారు.
ఈ సినిమా డిసెంబర్ 23న భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు వరుణ్ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడగా, రణవీర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.