ముందుగా జరిగిన ప్రచారం మేరకే ధనుష్ నటిస్తున్న ఫస్ట్ బైలింగువల్ మూవీ "వాతి/ సార్" డిసెంబర్ 2న విడుదల కావట్లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుందని తెలుపుతూ మేకర్స్ కొంతసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు.
వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
![]() |
![]() |