కొంతసేపటి క్రితమే 'మీట్ క్యూట్' ట్రైలర్ విడుదలైంది. ఐదు అర్బన్ మోడరన్ లవ్ స్టోరీల నేపథ్యంలో తెరకెక్కిన అంథాలజీ చిత్రమిది. ఇందులో మొత్తం ఐదు సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథలుంటాయి. మీట్ క్యూట్ అంటే - పరిచయంలేని వ్యక్తులు అనుకోకుండా కలిసినప్పుడు వారి మధ్య జరిగే క్యూట్ కాన్వర్జేషన్స్, మధ్యలో ఏర్పడే సైలెన్స్...ఈ సినిమాలో మీట్ క్యూట్ అనే పదానికి చాలా చక్కని విజువలైజన్ ఇచ్చారని తెలుస్తుంది.
నాచురల్ స్టార్ నాని సిస్టర్ దీప్తి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నవంబర్ 25 నుండి సోనీ లివ్ ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ కాబోతుంది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని, ప్రశాంతి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రోహిణి, వర్ష బొల్లమ్మ, రుహాని శర్మ, ఆకాంక్ష సింగ్, సంచితా పూనాచా, సురేఖావాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa