ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతోన్న టాప్ యాంకర్లలో అనసూయ ఒకరు. కేవలం యాంకర్‌గానే కాదు వెండితెరపై నటిగానూ ఆమె రాణిస్తున్నారు. ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా వచ్చిన తరవాత అనసూయ బదులు చాలా మంది రంగమ్మత్త అనే పిలుస్తున్నారంటే అతిశయోక్తికాదు. మోడరన్, ట్రెడిషనల్ ఇలా ఏ లుక్‌లో అయినా అనసూయ అందానికి వంకలు పెట్టలేం. ఇద్దరు పిల్లలకు తల్లయినప్పటికీ తనకిష్టమైన రంగంలో రాణిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది.
ఇదిలా ఉంటే, అనసూయ చాతిపై చిన్న టాటూ ఒకటి మనకు కనిపిస్తుంటుంది. అసలు ఆ టాటూ అర్థం ఏంటనే ప్రశ్న చాలా మంది అనసూయ అభిమానులకు కలిగే ఉంటుంది. అందుకే దీనిపై ఆమె స్పష్టత ఇచ్చారు. జనవరి 1న ‘ఆస్క్ అనసూయ’ పేరుతో ట్వి్ట్టర్‌లో తన అభిమానులతో అనసూయ ఇంటరాక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఓ అభిమాని ‘మీ టాటూకు అర్థం ఏమిటి?’ అని అడిగారు. దీనికి అనసూయ సమాధానం ఇస్తూ.. ‘దాని పేరు నిక్కు. నా భర్త ముద్దు పేరు’ అని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa