బాలీవుడ్ నటీనటులు విక్కి కౌశల్, కియారా అద్వానీ, భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం "గోవిందా నామ్ మేరా". దిగ్గజ బాలీవుడ్ నిర్మాణసంస్థ ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని శశాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతుందని ముందుగానే చెప్పిన చిత్రబృందం తాజాగా ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ కు రాబోతుందో తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు డిసెంబర్ 16న గోవిందా నామ్ మేరా మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa