మాస్ రాజా రవితేజ రవితేజ, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం "ధమాకా". నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది.
డిసెంబర్ 23న తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. రీసెంట్గా వాట్స్ హప్పెనింగ్ అనే బ్యూటిఫుల్ మెలోడీ విడుదల అయ్యింది. రమ్య బెహరా, భార్గవి పిళ్ళై కలిసి ఆలపించిన ఈ యూత్ ఫుల్ సాంగ్ కు సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గారు మోడరన్ లిరిక్స్ అందించారు. భీమ్స్ స్వరపరచగా, శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసారు.
లేటెస్ట్ గా ఈ పాటను శ్రీలంక సింగర్ యోహాని ఆలపించిన వీడియోను ధమాకా మేకర్స్ విడుదల చేసారు. గతేడాది మనికే మాగే హితే అనే కవర్ సాంగ్ తో యోహాని ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa