కరోనా కారణంగా డైరెక్ట్ ఓటిటి రిలీజైన చిత్రాలలో తెలుగు చిత్రం "కలర్ ఫోటో" ఒకటి. 2020, అక్టోబర్ 23వ తేదీన ఆహా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం 68వ నేషనల్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తెలుగు అవార్డును కొట్టేసి, ఔరా అనిపించింది.
కలర్ ఫోటో సెన్సిటివ్ లవ్ స్టోరీ ని బిగ్ స్క్రీన్ పై తీసుకొచ్చే ఉద్దేశంతో నవంబర్ 19వ తేదీన ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తామని గతంలో నిర్మాత సాయి రాజేష్ అధికారికంగా ప్రకటించారు. ఐతే, తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోవట్లేదని తెలుపుతూ సాయి రాజేష్ మరొక అధికారిక ప్రకటన చేశారు. ఇందుకుగల కారణాలను వివరించలేదు.
సందీప్ రాజ్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించారు. సునీల్ కీలక పాత్రలో నటించగా, కాలభైరవ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa