పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ అవతార్ లో చూసి చాలా రోజులైన అభిమానులు "సలార్" రాకకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'KGF' తో ఎంత పెద్ద కమర్షియల్ మాస్ హిట్ అందుకున్నాడో తెలిసిందే. మాస్ పల్స్ బాగా తెలిసిన ప్రశాంత్ తో ప్రభాస్ సినిమా అంటే ప్రేక్షకులందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుత షెడ్యూల్ లో ప్రభాస్ పై తన మార్క్ హై ఇంటెన్స్ మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ ను చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నారట ప్రశాంత్ నీల్. ఈ మేరకు ఒక భారీ సెట్ ను కూడా మేకర్స్ రూపొందించారట.
హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. పోతే, ఇందులో శృతి హాసన్ హీరోయిన్ కాగా, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, విలక్షణ నటుడు జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa