బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, అందాల భామ అలియా భట్ ప్రధాన పాత్రలలో జోయా అఖ్తర్ తెరకెక్కిస్తున్న చిత్రం గల్లీ భాయ్. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వస్తున్న రణ్‌వీర్ ఈ మూవీలో చీర్‌ఫుల్ క్యారెక్టర్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అలియా లైట్ మేకప్ వేసుకొని స్కార్ఫ్ ధరించింది. పోస్టర్‌లో వీరిద్దరి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. చిత్రంలో కల్కి కొచ్చిన్, ఆకాంక్ష పూరీ, విజయ్ వర్మ, అలీ అస్గర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. రణవీర్ నటించిన సింబా చిత్రం రీసెంట్‌గా విడుదలై మంచి విజయం సాధించింది. అలియా నటించిన మరో చిత్రం బ్రహ్మస్త్రా అతి త్వరలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa