ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న వరుణ్ ధావన్ 'భేడియా'

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 07:28 PM

అమర్ కౌశిక్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ బాలీవుడ్ సినిమాకి 'భేడియా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా నవంబర్ 25, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కాంతారా సినిమాని తెలుగులో విడుదల చేసిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగులో 'తోడేలు' టైటిల్ తో  విడుదల చేస్తుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డ్ నుండి యు/ఎ సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా 2 గంటల 36 నిమిషాల రన్‌టైమ్ ని కలిగి ఉంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ సరసన జోడిగా బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. హారర్-కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమా 3D ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది. మాడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa