కన్నడ చిత్ర పరిశ్రమ నుండి రాబోతున్న పాన్ ఇండియా చిత్రం "విజయానంద్". కర్ణాటక బేస్డ్ ఆటో మొబైల్ బిజినెస్ మాన్ విజయ్ శంఖేశ్వర్ బయోపిక్ గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి కొంతసేపటి క్రితమే ట్రైలర్ విడుదలైంది. మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో, జీవిత విలువలను తెలిపే ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. పోతే, డిసెంబర్ 9న పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.
VRL ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆనంద్ శంఖేశ్వర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిహాల్, సిరి ప్రహ్లాద్ జంటగా నటించారు. రిషిక శర్మ డైరెక్టర్ గా వ్యవరిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa