హారర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన "మసూద" సినిమాకు చాలా మంచి రివ్యూలు వస్తున్నాయి. సంగీత, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, సత్యం రాజేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసారు.
గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా స్పైన్ చిల్లింగ్ హారర్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను భయపెడుతూ, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ నంబర్లను నమోదు చేస్తుంది. ఈ నేపధ్యంలో శుక్రవారం నాటి మసూద వసూళ్ల కన్నా సోమవారం వసూళ్లు ఎక్కువగా ఉండడం విశేషం ... బుక్ మై షోలో ఈ సినిమా 9.2 రేటింగ్ తో నిలకడగా సత్తా చాటుతుంది.
![]() |
![]() |