ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ "18 పేజెస్" నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 05:07 PM

కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్. ఆయన నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "18 పేజెస్". మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'నన్నయ్య రాసిన కావ్యమాగితే ... తిక్కన తీర్చెనుగా... రాధమ్మ పాడిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా ...' అనే బ్యూటిఫుల్ లవ్ మెలోడీ లిరికల్ సాంగ్ విడుదలైనది. ఈ పాటను గోపి సుందర్ స్వరపరచగా, సింగర్స్ పృథ్వి చంద్ర, సితార కృష్ణకుమార్ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు.  


పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa