ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న హిట్ 2..??

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 02:05 PM

శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "హిట్ 2" సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. ఈ రోజే ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా, ఆడియన్స్ నుండి చాలా మంచి రివ్యూలు వస్తున్నాయి.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో శేష్ మాట్లాడుతూ... హిట్ 2 సినిమాను ముందుగా తెలుగులో మాత్రమే విడుదల చేద్దామని అనుకున్నాం..కానీ చాలామంది నార్త్ నెటిజన్లు పాన్ ఇండియా రిలీజ్ చెయ్యాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు నాని గారితో హిట్ 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్ పై డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు.


డిసెంబర్ 2న ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న హిట్ 2 మూవీ అన్ని కుదిరితే పాన్ ఇండియా రిలీజ్ అవ్వొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa