ఓటీటీలో 'యశోద' సినిమా విడుదలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యశోద సినిమాలో తమ ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా చూపించారని ఇవా హాస్పిటల్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సినిమా ఓటీటీ విడుదలకు బ్రేక్ వేసింది. యశోద సినిమా యూనిట్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. హరి-హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.