ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన లవ్ టుడే సినిమా రీసెంట్గానే థియేటర్లలో విడుదలై సూపర్ పాజిటివ్ రివ్యూలను అందుకుంటుంది. విశ్లేషకులు, పలువురు సినీ సెలెబ్రిటీల నుండి కూడా ఈ సినిమాకు ప్రశంసలు వస్తున్నాయి. దీంతో పది కోట్ల కన్నా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 65కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి అందరిని ఔరా ! అనిపించింది.
లవ్ టుడే కొస్తున్న స్పందన కారణంగా తెలుగులో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు గారు రెడీ అయ్యారు. పోతే, రేపే ఈ సినిమా తెలుగు రిలీజ్ కాబోతుంది.
ఇందులో ఇవానా హీరోయిన్ గా నటించింది. రాధికా శరత్ కుమార్, సత్యరాజ్ కీలకపాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.