సినిమాలతో పాటుగా డిజిటల్ రంగంలోనూ తనదైన ముద్రవేస్తున్నారు హీరో నవీన్ చంద్ర. రీసెంట్గానే అమ్ముతో ఓటిటి ఆడియన్స్ ను పలకరించిన నవీన్ చంద్ర రిపీట్ తో మరొకసారి వారిముందుకు రాబోతున్నారు.
అరవింద్ శ్రీనివాసన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల విడుదల కాలేదు. డిసెంబర్ 1 నుండి రిపీట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. పోతే, ఈ మూవీ రీసెంట్ తమిళ్ హిట్ ఓటిటి ఫిలిం డెజావు కి తెలుగు రీమేక్. మిస్టికల్ కాప్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమా లో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.
సీనియర్ హీరోయిన్ మధుబాల, అచ్యుత్ కుమార్, మైమ్ గోపి, స్మృతి వెంకట్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa