ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా SS రాజమౌళి గారు హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. RRR ప్రమోషన్స్ నిమిత్తం విదేశాలలో బిజీగా గడుపుతున్న రాజమౌళి ఈ ఈవెంట్ తో టాలీవుడ్ మీడియాను పలకరించనున్నారు. పోతే, ఈ ఈవెంట్ నవంబర్ 28 సోమవారం సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్లోని JRC కన్వెన్షన్స్ లో జరగబోతుంది.
శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమాకు ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa