క్రియేటివ్ అండ్ ట్యాలెంటెడ్ సుకుమార్ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం "పుష్ప 2". గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్ కారణంగా పుష్ప సీక్వెల్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్గానే పుష్ప 2 సీక్వెల్ కూడా స్టార్ట్ అయ్యింది.
తాజా అధికారిక సమాచారం మేరకు, పుష్ప ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 8న రష్యాలో రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 1, 3 తారీఖుల్లో మాస్కో, పీటర్స్ బర్గ్ నగరాలలో పుష్ప ప్రీమియర్స్ జరగనున్నాయి. విశేషమేంటంటే, ఈ ప్రీమియర్స్ కు పుష్ప చిత్రబృందం మొత్తం హాజరుకానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.