సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రష్యాలో విడుదల కానుంది. డిసెంబర్ 1వ తేదీన మాస్కోలో, డిసెంబర్ 3వ తేదీన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యన్ భాషలో ఈ సినిమాను స్పెషల్ ప్రీమియర్ వేయనున్నారు. అయితే ఈ స్పెషల్ ప్రీమియర్లకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో 'పుష్ప' టీం రష్యన్ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తగ్గేదెలే అంటూ తీసుకున్న ఫోటోను అల్లుఅర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.