టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జోడిగా నటిస్తుంది.
తాజాగా ఇప్పుడు, ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2023న విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వారాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం తన తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ షూటింగ్ కి రాలేకపోయారు అన్ని ఫార్మాలిటీల పూర్తి చేసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ మళ్ళీ షూటింగ్ ప్రారంభించనున్నాడు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.