బిగ్ బాస్ ఫేమ్ రియాన్ సోహెల్ హీరోగా నటిస్తున్న చిత్రం "లక్కీ లక్ష్మణ్". ఇందులో మోక్ష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - డైరెక్షన్ - AR అభి చేసారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. హరిత గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు డిసెంబర్ 3వ తేదీన ఉదయం తొమ్మిదింటికి లక్కీ లక్ష్మణ్ టీజర్ విడుదల కాబోతుందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చెయ్యడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa