టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జోడిగా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2023న విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వారాలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మూవీ మేకర్స్ ఒక కీలక పాత్ర కోసం ప్రముఖ నటి శోభనను సంప్రదించినట్లు సమాచారం. అయితే, ఆమె బోర్డులో ఉందా లేదా అనే దానిపై మూవీ మేకర్స్ ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.