ధనుష్ నటిస్తున్న సరికొత్త చిత్రం "కెప్టెన్ మిల్లర్". అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీరోల్ లో నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితాసతీష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో కన్నడ సీనియర్ హీరో కారునాడ చక్రవర్తి డా. శివరాజ్ కుమార్ గారు ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా తెలుపుతూ మేకర్స్ కొంతసేపటి క్రితమే అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు. అంతకుముందే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని శివన్న రివీల్ చేసిన విషయం తెలిసిందే. పోతే, ఇందులో శివన్న ధనుష్ కు అన్నయ్య పాత్రలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa