ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ కి భవిష్యత్తు పై ఆశలు కల్పించిన 2018

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 06, 2019, 02:37 AM

2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటానికి కూడా చాలా మంది ఇష్టపడలేదు అనే చెప్పాలి. ఆ సమయంలో నరేంద్ర మోడీ ఊపు చూసిన ప్రతి ఒక్కరు ఇక కాంగ్రెస్ బ్రతికే అవకాశం లేదని భావించారు. ఇక మోడిని ఎదుర్కొనే నాయకుడు కూడా ఆ పార్టీలో లేకపోవడంతో కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు ఇక లేదనే వారు ఎక్కవయ్యారు. సోనియా గాంధీ అనారోగ్యంతో పాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల నుంచి తప్పుకోవడం మోడికి ధీటుగా రాహుల్ గాంధి ప్రసంగాలు చేయలేకపోవడం వంటివి కాంగ్రెస్ కి ఇబ్బందిగా మారాయి.
ఇదే సమయంలో రాహుల్ గాంధి ఒక్క బులెట్ మాదిరి దూసుకొచ్చారు. గత ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి 4 రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుంది కాబట్టి ఇక రాహుల్ గాంధీ నిలబడే అవకాశం లేదన్న వారు ఎక్కువే. దీనికి తోడు హిందుత్వ అనే బ్రాండ్ కోసం రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల్లో చేసిన ప్రయత్నాలు కూడా అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. కాని అదే కర్ణాటక ఎన్నికల్లో సుప్రీం కోర్ట్ కి వెళ్లి జెడిఎస్, కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో రాహుల్ గాంధీ కీలకంగా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో పాటు ఈ ఏడాది ద్వితియార్ధంలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో రాఫెల్ డీల్ ని రాహుల్ గాంధీ బయట పెట్టిన తీరు చూసిన వారు అందరు ఆశ్చర్యపోయారు. తనకు అవకాశం వస్తే చుక్కలు చూపిస్తాను అని ముందే చెప్పిన ఆయన అవిశ్వాసాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఇక 2019 చివర్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ నరేంద్ర మోడికి ధీటుగా అయితే రాహుల్ గాంధీ ఎదిగే అవకాశం లేదని అన్నారో..అదే రాహుల్ గాంధీ 3 రాష్ట్రాల్లో రైతులను, సామాన్యులను దగ్గర చేసుకోవడం ద్వారా అదే నరేంద్ర మోడికి చుక్కలు చూపించారు. చెప్పిన విధంగా కేవలం 2 రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేయడం ద్వారా తమది రైతు పక్షపాత ప్రభుత్వం అనే సంకేతాన్ని ఇచ్చి బిజెపిని ఆత్మ రక్షణలో పడేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక చంద్రబాబు చొరవతో కాంగ్రెస్ వద్దకు అన్ని పక్షాలు రావడం రాహుల్ కి కలిసి వచ్చే అంశం. ఇక తనలో విషయం ఉంది మోడిలో విషయం లేదు అని చెప్పడంలో రాహుల్ గాంధీ దాదాపుగా విజయం సాధించారు అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ కి ఈ ఏడాది కలిసి వచ్చింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa