టాలీవుడ్ లో స్టార్ కపుల్స్ చాలామందే ఉన్నారుగానీ అందరూ ఎక్కువగా ఆసక్తి చూపేది మాత్రం మెగా కపుల్ ఉపాసన - రామ్ చరణ్ పైనే. చరణ్ స్క్రీన్ మీద దుమ్ముదులుపుతాడుగానీ రియల్ గా మాత్రం వినయంగా విధేయంగా ఉంటాడు. ఇంటర్వ్యూలలో చక్కగానే మాట్లాడతాడు గానీ సోషల్ మీడియాలో మిగతా స్టార్లతో పోలిస్తే మాత్రం వీక్ అనే చెప్పాలి.
ఫేస్ బుక్ ఖాతా ద్వారా అప్పుడప్పుడు అప్డేట్లు ఇస్తాడు గానీ పర్సనల్ విషయాలు మాత్రం దాదాపుగా పంచుకోడు. ఇక ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్ లలో చరణ్ కు అధికారికంగా ఏ ఖాతాలు లేవు. దీంతో అ లోటు ను మెగా వదినమ్మ తీరుస్తోంది. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారానే.. చరణ్ కు సంబంధించిన అప్డేట్లు ఇస్తూ ఉంటుంది. చరణ్ ఫ్యాన్స్ అందరూ అప్డేట్ ల కోసం ఉపాసన వదినమ్మనే ఫాలో అవుతున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు మహేష్ బాబు.. ఎన్టీఆర్ లతో చరణ్ కు అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందన్న సంగతి అందరికీ తెలియడానికి కారణం ఉపాసన సోషల్ మీడియా పోస్టులే.
రెగ్యులర్ గా చరణ్ కు సంబంధించిన ఫోటోలు..వీడియోల పోస్ట్ చేసే ఉపాసన చరణ్ సినిమా విడుదల సమయంలో తన జోరు మరింతగా పెంచుతుంది. గతంలో 'రంగస్థలం' రిలీజ్ సమయంలో అలానే చేసింది. ఇప్పుడు 'వినయ విధేయ రామ' కు కూడా అలానే తనవైపు నుండి ప్రమోషన్స్ విషయంలో ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. ఈ విషయంలో అభిమానులందరు ఫుల్ హ్యపీస్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa