ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ స్టార్ ని మించేలా బాహుబలి థియేటర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 07, 2019, 12:46 PM

థియేటర్స్ బిజినెస్ భూమ్ భూమ్ అంటూ పరుగులు పెడుతోంది. టాలీవుడ్ టాప్ స్టార్లు అగ్ర నిర్మాతలు ఫైనాన్షియర్లు ఈ రంగంలో భారీ రాబడిపై కన్నేయడంతో ప్రస్తుతం పోటీ తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. పర్యవసానంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా మల్టీప్లెక్స్ కల్చర్ విస్తరించడమే గాకుండా మల్టీప్లెక్స్ థియేటర్ వ్యవస్థకు పూర్తి స్థాయి సన్నాహకం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో డి.సురేష్ బాబు అల్లు అరవింద్ ఏషియన్ నారంగ్ దిల్ రాజు వంటి ప్రముఖులు ఉన్నారు. స్టార్లలో మహేష్ ప్రభాస్ అల్లు అర్జున్ వంటి వారు భారీ ప్రణాళికలతో వేడి పెంచుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ రంగంలో డార్లింగ్ ప్రభాస్ భారీగానే పెట్టుబడులు పెడుతున్నాడని అర్థమవుతోంది. ఇప్పటికే నెల్లూరు- తిరుపతి పరిసరాల్లో ప్రభాస్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారని ప్రచారమైంది. తాజా సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. టౌన్కి కేవలం నాలుగు కి.మీల దూరంలో చెన్నై - కోల్కతా జాతీయ రహదారి పక్కన పిండిపాళెం వద్ద దీన్ని నిర్మిస్తున్నారు.

ఈ మల్టీప్లెక్స్ సామర్థ్యం వివరాల్లోకి వెళితే.. ఒక్కో థియేటర్లో 170 సిట్టింగ్ సామర్థ్యంతో.. స్క్రీన్లు అన్నిటా 670 సీట్ల తో సిట్టింగ్ కి అనుకూలంగా ఉంటుందిట.3డీ కి అనుగుణంగా సౌండ్ సిస్టమ్ ఉంటుంది.  దేశంలోనే తొలిసారిగా 106 అడుగుల వెడల్పుతో తెర ఏర్పాటు చేస్తుండడం మరో హైలైట్ అని చెబుతున్నారు. ఇంత భారీ మల్టీప్లెక్స్ కి ఖర్చు ఎంతవుతోంది? అంటే.. ప్రభాస్- యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో  నిర్మిస్తున్నారట. ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీఫ్లెక్స్ ఉంటుంది. 106 అడుగుల వెడల్పు గల భారీ తెరలు ప్రపంచంలో మరో రెండు మాత్రమే ఉంటే ఆ కోవలో ఇది మూడోది. ఆసియాలో ప్రభాస్ స్క్రీన్ రెండోది అవుతుందిట. ఈ వివరాల్ని బట్టి మహేష్ నిర్మించిన ఏఎంబీ మాల్ స్క్రీన్ కంటే ఇది ఎంతో పెద్దదని అర్థమవుతోంది. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa