పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటిస్తుంది. ఈ రొమాంటిక్ డ్రామాకి "18 పేజెస్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.
తాజా సమాచారం ప్రకారం, డిసెంబర్ 19, 2022న హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ రొమాంటిక్ లవ్ డ్రామా యొక్క గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కానున్నారు అని సమాచారం. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత అందిస్తున్నారు. '18 పేజెస్' డిసెంబర్ 23, 2022న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాని GA2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa