పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసారు డైరెక్టర్ మారుతీ. ఒక హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. గత నెల్లోనే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కీరోల్ లో నటిస్తున్నారని ఎప్పటినుండో జరుగుతున్న ప్రచారం గురించి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సంజయ్ రోల్ గురించి ఆసక్తికరమైన విషయం వినబడుతుంది. అదేంటంటే, ఈ సినిమాలో ప్రభాస్ తాత పాత్రలో సంజయ్ నటించబోతున్నారట.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa