కోలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'లవ్ టుడే' గత నెల్లో తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంటుంది. తమిళంలో చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు అధిక లాభాలను తెచ్చిపెట్టింది.
తెలుగు, తమిళ భాషలలో అమేజింగ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా తాజాగా హిందీ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. ఐతే, అక్కడ లవ్ టుడే డబ్బింగ్ అవ్వడం కాదు... రీమేక్ కాబోతుందంట. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కు ఈ సినిమా చాలా బాగా నచ్చడంతో ఈ మూవీ రీమేక్ హక్కులను కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారట. అన్నీ కుదిరితే, హిందీలో ఈ సినిమాను వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్ట్ చెయ్యబోతున్నారట. మరి, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాలంటే, ఇంకొన్నాళ్ళు ఎదురుచూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa