సాయి రోనక్, అంకితా సాహా జంటగా నటించిన చిత్రం "రాజయోగం". రామ్ గణపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ్ మురళీధరన్ సంగీతం అందిస్తున్నారు.
రీసెంట్గానే రాజయోగం టీజర్ ను హీరో విశ్వక్ సేన్ విడుదల చెయ్యగా, తాజాగా మేకర్స్ రాజయోగం ట్రైలర్ ను విడుదల చేసారు. వజ్రాల దొంగతనం నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా యొక్క ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది.
శ్రీ నవబాలా క్రియేషన్స్ , వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై మని లక్ష్మణ్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.