బెదురులంక 2012 సినిమా నుండి రీసెంట్గానే హీరో కార్తికేయ ఫస్ట్ లుక్ గ్లిమ్స్, ఆపై హీరోయిన్ నేహశెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆడియన్స్ దృష్టిని ఆకర్షించగా తాజాగా మేకర్స్ సినిమాలో కీలకపాత్రల పరిచయానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఐదింటికి కీలకపాత్రలను పరిచయం చేస్తూ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చెయ్యనున్నారు.
క్లాక్స్ డైరెక్షన్లో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ సినిమాను యువరాజు సమర్పిస్తున్నారు.
ఇంకా ఈ సినిమాలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, LB శ్రీరాం తదితరులు నటిస్తున్నారు.