రంగమార్తాండ లో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన 'నేనొక నటుడ్ని' షాయరీ కొంతసేపటి క్రితమే విడుదలైంది. నేనొక నటుడ్ని... చెమ్కీల బట్టలేసుకుని, అడ్డబొట్టు పెట్టుకుని, కాగితం పూల వర్షంలో, కీలుగుఱ్ఱంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను.. అని సాగే ఈ షాయరీ ఒక నటుడు స్వభావాన్ని, లక్ష్యాన్ని... ఎంతో హృద్యంగా తెలియచేస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ మాటల్లో ఈ షాయరీ మరింత భావోద్వేగభరితంగా, ఆలోచన చేసే విధంగా ... ఆడియన్స్ కు గూజ్ బంప్స్ కలిగించేలా ఉంది. చప్పట్లను భోంచేస్తూ.. ఈలలను శ్వాసిస్తూ.. అనుక్షణం జీవించే అల్ప సంతోషిని నేను.. మహా అదృష్టవంతుడిని నేను.. తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే సగటు కళాకారుడ్ని నేను ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు.. నటుడిగా నన్నిష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు ... అని ఆఖరిగా వచ్చే ఈ లిరిక్స్ ... కళ్ళు చెమర్చేలా చేస్తున్నాయి.
ఈ అరుదైన ఆలోచనకు లక్ష్మి భూపాల్ అందమైన అక్షర రూపం కల్పించారు. సంగీత దైవం ఇళయరాజా గంధరస్వరాలను సమకూర్చారు. నాటమార్తాండ చిరంజీవి గారు అపురూప గళమాధుర్యాన్ని అందించారు.
కృష్ణవంశీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయా భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీరేజా తదితరులు నటిస్తున్నారు.