కమల్ హాసన్ కూతురిగా సినీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలో ఈ బ్యూటీ బిజీబిజీగా ఉంది. అయితే శ్రుతి కొన్నాళ్లుగా శాంతను పూజరికతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ విడిపోయారంటూ కొద్దిరోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రుతి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ 'నేను కోరుకునేది ఇదే’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో బ్రేకప్ వార్తలకు చెక్ పడింది. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో శాంతను హజారిక గురించి శ్రుతి మాట్లాడింది. శాంతను తన బెస్ట్‌ఫ్రెండ్ అని, అతను అద్భుతమైన వ్యక్తి అంటూ పొగడ్తలతో ముచ్చెత్తింది.