మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో ఎంతో క్రేజ్ ను సంపాదించింది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ మరాఠీ భామ పిప్పా అనే సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ భామ హీరోయిన్ల రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నటీనటులకు ఉన్న గుర్తింపు, పాపులారిటిని బట్టి ఎంత పారితోషికం ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. అయితే చాలా మంది హీరోయిన్స్ తాము కోరుకున్న రెమ్యునరేషన్‌ని డిమాండ్ చేసే విషయంలో అయమోమయంలో ఉంటారు. అది మంచిది కాదు. రెమ్యునరేషన్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో అర్థమవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది.