మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" సినిమా ఆగస్ట్ 5న తెలుగు మరియు హిందీలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్, టోవినో థామస్, మంజు వారియర్ తదితరులు నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్‌కి రీమేక్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఇంటర్నేషనల్ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ ని సృష్టిస్తుంది. ఈ సినిమా గత వారంలో భారతదేశంలోని OTT ప్లాట్‌ఫారమ్ యొక్క టాప్ టెన్ సినిమాలలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. పొలిటికల్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.